Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపార్టీలకతీతంగా గౌరవించే వ్యక్తి ధర్మభిక్షం

పార్టీలకతీతంగా గౌరవించే వ్యక్తి ధర్మభిక్షం

- Advertisement -

కూనంనేని, పల్లా
సీపీఐ ఆఫీస్‌లో ధర్మభిక్షం 15 వర్థంతి నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఎంపీ, పార్టీలకతీతంగా గౌరవించే గొప్ప వ్యక్తి బొమ్మగాని ధర్మభిక్షమని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొనియాడారు. గురువారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్థంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పల్లా, కూనంనేని మాట్లాడుతూ..ధర్మభిక్షం అన్ని వర్గాల ప్రజలకు ఆత్మీయుడనీ, ప్రజాసంఘాల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చాటిచెప్పిన గొప్పనాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కలపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, గీత పనివారల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిజీ సాయిల్‌ గౌడ్‌, గీత పని వారల సంఘం నాయకులు బొమ్మగాని నాగభూషణం, కేవీఎల్‌, ప్రవీణ్‌ కుమార్‌ గౌడ్‌, బొమ్మగాని కిరణ్‌ కుమార్‌, రహమాన్‌, ఏ గోవిందరావు, బి శ్రీరాములు, బి అంజయ్య తదితరులు ధర్మబిక్షం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -