నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గంగాదేవి సైదులు డిమాండ్ చేశారు. ఆదివారం చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామపంచాయతీలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపు మేరకు సీపీఐ(ఎం) పోరుబాట కార్యక్రమంలో గుర్తించిన సమస్య లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లు వీధి లైట్లు గ్రామంలోని కెమికల్ కంపెనీలతో కెమికల్ కలిసి పాడైన నీళ్ల సమస్యలు సర్వే చేసి గుర్తించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీ, వికలాంగుల రూ.3000 నుంచి రూ.6000 వితంతువులకు ఒంటరి మహిళలకు రూ.2000 నుంచి రూ.4000 పింఛన్లు ఉపాధి హామీ కూలీలకు 12,500 మహిళలకు 2,500 లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న హామీలు అమలు చేయాలని సైదులు డిమాండ్ చేశారు.
గ్రామంలో స్థానిక సమస్యలు జాతీయ రహదారి ధర్మోజిగూడెం గేటు నుండి దోతి గూడెం వరకు బీటీ రోడ్డు గుంతల మయంగా మారిందని తక్షణమే రోడ్డును మరత్మాతు చేయాలని తెలిపారు. .గ్రామంలో దోమల సమస్యతో ప్రజలు డెంగ్యూ మలేరియా రోగాలకు గురవుతున్నారని, తక్షణమే అధికారులు స్పందించి గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి కొంతం శ్రీనివాస్ రెడ్డి డివైఎఫ్ఐ మాజీ మండల అధ్యక్షులు సామిడి నాగరాజు రెడ్డి పార్టీ సభ్యులు పగిళ్ల శశిరేఖ పక్కీరు పెంటారెడ్డి జంగం అంజయ్య జంగం రాములు ఐతరాజు సోమయ్య ఎస్సగొని లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ధర్మోజిగూడెం స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES