Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి ధ్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక చేయూత..

మృతుడి కుటుంబానికి ధ్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక చేయూత..

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండలంలో అర్ధాంతరంగా మృతి చెందిన భాదిత కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందజేసి చేయూతను అందిస్తున్న జననేత.. ధ్యాప నిఖిల్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం ఊరుకొండ మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన కటికం ఆంజనేయులు(55) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ యువ నాయకుల ద్వారా 5వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు మధుసూదన్ రెడ్డి, పరమేష్, ఆంజనేయులు, వసీం, అంజి, నిరంజన్, సాయికృష్ణ, సంతోష్, హరీష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -