పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిడి వశిష్ట తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెల 15 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఫాంటసీ, కామెడీ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కథ – మానస శర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: మానస శర్మ, మహేష్ ఉప్పాల, మ్యూజిక్ – అనుదీప్ దేవ్, సినిమాటోగ్రాఫర్: రాజు ఎడురోలు, యాక్షన్ కొరియోగ్రాఫర్ : విజరు, ఎడిటర్ – అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్ – రామాంజనేయులు, ఆర్ట్ డైరెక్టర్ – పుల్లా విష్ణు వర్ధన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్.
భిన్న జోనర్ సినిమా
- Advertisement -
- Advertisement -