Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeసినిమాభిన్న పొలిటికల్‌ జోనర్‌..

భిన్న పొలిటికల్‌ జోనర్‌..

- Advertisement -

‘మార్గన్‌’ విజయం తర్వాత విజయ్‌ ఆంటోనీ మరో పవర్‌ ఫుల్‌ ప్రాజెక్ట్‌ ‘భద్రకాళి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు.
ఈ ప్రాజెక్ట్‌ను విజరు ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌, మీరా విజరు ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో మార్గన్‌ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్‌ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా సపోర్ట్‌ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్‌ ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ విడుదల చేసిన ‘జిల్‌.. జిల్‌’ సాంగ్‌ విశేష ప్రేక్షకాదరణ పొందింది.
హీరో విజరు ఆంటోని మాట్లాడుతూ,’ఈ సినిమాలో నటించడం అదష్టంగా భావిస్తున్నాను. అరుణ్‌ ప్రభు నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత చాలామంది ఆయన్ని గొప్పగా అభిమానిస్తారు. నిర్మాత రామాంజ నేయులు ఈ సినిమాతో కొలాబరేట్‌ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ధనుంజయ అద్భుతమైన ప్రొడ్యూసర్‌. హీరోయిన్‌ తప్తి చాలా మంచి నటి. ఈ సినిమాల్లో చాలా సెటిల్డ్‌గా పెర్ఫార్మ్‌ చేసింది. సురేష్‌ బాబు లేకపోతే మేం ఇంత నమ్మకంగా ఉండే వాళ్ళం కాదు. ఆయన రిలీజ్‌ చేయడమే కాదు. ప్రోడక్ట్‌ మీద ప్రతి విషయంలో చాలా కేరింగ్‌ తీసుకుంటారు. ఇది నా 25వ చిత్రం. వెరీ న్యూ పొలిటికల్‌ జోనర్‌. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్‌ సినిమాలన్నిటికీ ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది’ అని అన్నారు.
‘వినోదంతో సామాజికంగా ప్రాధాన్యత ఉన్న ఎలిమెంట్స్‌ని తీసుకుని ప్రేక్షకుడు ఆలోచించే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దాం. ఏషియన్‌ సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ‘మార్గాన్‌’ సినిమాని రిలీజ్‌ చేసి చాలా సక్సెస్‌ని అందుకున్నా. ఈ సినిమా కూడా రిలీజ్‌ అయ్యి పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాను’ అని ప్రొడ్యూసర్‌ రామాంజనేయులు చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad