Tuesday, July 29, 2025
E-PAPER
Homeజిల్లాలుకాటాపూర్ లో డిజిటల్ క్లాసులు ప్రారంభం.. 

కాటాపూర్ లో డిజిటల్ క్లాసులు ప్రారంభం.. 

- Advertisement -

ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్ 
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం ప్రధానోపాధ్యాయులు బాణాలు సుధాకర్ డిజిటల్ క్లాసులను ప్రారంభించారు. గతంలో అమెరికాలో ఉంటున్న ఎన్నారై రవి పులి ఈ పాఠశాలకు డిజిటల్ క్లాసులకు సంబంధించిన ట్యాబ్లు, ఇంటర్నెట్ కలెక్షన్ అన్ని సౌకర్యాలు ఆయన సొంత ఖర్చులతో అందించిన విషయం విధితమే. ఈ 2025-26 విద్యా సంవత్సరం కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు ఒక రూమును అరేంజ్ చేసి అందులో సామాగ్రి అంతా అమర్చి డిజిటల్ క్లాసులను ప్రారంభించారు. విద్యార్థులు సాఫ్ట్వేర్ ఆధారంగా పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ, సైన్స్ క్యూజ్ ను అభ్యసించారు.

చదువుతోపాటు వీడియో క్లాసులు చూసి నేర్చుకోవడం వల్ల అనుభూతి కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్ మాట్లాడుతూ డిజిటల్ తరగతుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నామన్నారు. కాటాపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలకు ఎన్నారై రవి పులి డిజిటల్ తరగతులకు సంబంధించిన ట్యాబ్లు, మెటీరియల్ అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సక్రు నాయక్, అక్బర్ పాషా, జీవన్ లాల్, కోడూరి సమ్మయ్య, సుతారి పాపారావు, మోహన్, వెంకటేష్, జైపాల్, విజయ, శ్రీదేవి, రాజేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -