Sunday, November 9, 2025
E-PAPER
Homeబీజినెస్డిజిటల్‌ పసిడి బాండ్లకు రక్షణ లేదు..!

డిజిటల్‌ పసిడి బాండ్లకు రక్షణ లేదు..!

- Advertisement -

అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో విక్రయిస్తోన్న పసిడి బాండ్లు తమ నియంత్రణ పరిధిలోకి రావని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) స్పష్టం చేసింది. అలాంటి డిజిటల్‌ గోల్డ్‌ ఉత్పత్తులు ప్రస్తుత చట్టాల ప్రకారం అవి సెక్యూరిటీలు గానీ, కమోడిటీ డెరివేటివ్‌లు కావని తెలిపింది. కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదని.. అవి పూర్తిగా సెబీ వెలుపల పని చేస్తాయని పేర్కొంది. అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్‌ పరిధిలోని పెట్టుబడిదారుల రక్షణ విధానాలు ఏవీ లేవని హెచ్చరించింది. బంగారంలో పెట్టుబడుల కోసం చాలా మంది ఇటీవల కాలంలో డిజిటల్‌ గోల్డ్‌పై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా దంతెరస్‌, అక్షయతృతీయ లాంటి రోజున ఫిన్‌టెక్‌ వేదికలు రూ.100 నుంచే డిజిటల్‌ పసిడిని ఇంటి వద్ద నుంచే కొనుగోలు చేయవచ్చని వినియోగదారులను ఊరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వినియోగదారులను అప్రమత్తం చేస్తూ ఈ ప్రకటన విడుదల చేసింది. డిజిటల్‌ లేదా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో లభించే గోల్డ్‌ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మదుపర్లను హెచ్చరించింది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ తెలిపింది. డిజిటల్‌ గోల్డ్‌లో కౌంటర్‌ పార్టీ, ఆపరేషనల్‌ రిస్కులు పొంచి ఉంటాయని హెచ్చరించింది. అంటే సదరు ప్లాట్‌ఫామ్‌ తిరిగి డబ్బు చెల్లించలేకపోవడం, నిర్వహణపరమైన ఇబ్బందులకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌ అందించే ఎక్స్ఛేంజ్‌ ట్రేడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), స్టాక్‌ ఎక్స్‌ఛేÛంజీల్లో ట్రేడయ్యే ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్‌లు (ఈజీఆర్‌ఎస్‌) వంటివి సెబీ పరిధిలోకి వస్తాయని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -