- Advertisement -
నవతెలంగాణ కాటారం కాటారం మండలంలోని ఆదివారంపేట్, పరికిపల్లే, ప్రతాపగిరి, మర్రిపల్లె గ్రామా ల లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు యొక్క ప్రాముఖ్యతను రైతులకు, పశుపోషకులకు వివరించారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి. రమేష్ గారి ఆధ్వర్యంలో టీకాల కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ జి రమేష్, డాక్టర్ ధీరజ్ పశు వైద్య సహాయకులు తుంగల రాజశేఖర్, మెరుగు కిషన్, సుల్తానాబేగం గోపాలమిత్ర శ్రీనివాస్, పశుమిత్ర నజీమా పాల్గొన్నారు.
- Advertisement -



