Saturday, July 26, 2025
E-PAPER
Homeజాతీయందేశానికే దిశానిర్దేశం

దేశానికే దిశానిర్దేశం

- Advertisement -

– ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే
– సీఎం రేవంత్‌రెడ్డిది సాహసోపేతమైన చర్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణ రాష్ట్రం కులగణనను విజయవంతంగా నిర్వహించి దేశానికే దిశానిర్దేశం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. కులగణన చేపట్టిన సీఎం రేవంత్‌ రెడ్డిది నిజంగా సాహసోపేతమైన చర్యని అభివర్ణించారు. ఈ సర్వే సందర్భంగా కొన్ని వర్గాల నుంచి ప్రతిఘటన ఎదురై ఉండవచ్చని చెప్పారు. కుల గణన పై ఇందిరా భవన్‌లో ప్రజెంటేషన్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, మైనారిటీల మధ్య ఐక్యతకు పిలుపునిచ్చారు. ఈ వర్గాలు సామాజికంగా, రాజకీయంగా కలిసి వచ్చి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన తర్వాతే… దేశవ్యాప్తంగా పార్టీకి 70 శాతం కంటే ఎక్కువ మద్దతు లభించిందన్నారు. అలాగే ‘భారత్‌ జోడో యాత్ర’ లో ఇచ్చిన మాటకు కట్టుబడి… తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన లోక్‌ సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీని ప్రత్యేకంగా ప్రశంసించారు. కులగణన అంశాన్ని లేవనెత్తడమే కాక, ‘జై బాపు, జై భీమ్‌, జై సంవిదాన్‌’నినాదంతో రాజ్యాంగాన్ని కాపాడటానికి రాహూల్‌ కారణమని అన్నారు. గాంధీ ఒత్తిడి కారణంగానే ప్రధాని మోడీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను చేస్తామని దిగిరాక తప్పలేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -