నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అయితే, విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంపత్ నంది ఇంటికి వెళ్లి ఆయన తండ్రి భౌతికకాయానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో రచ్చ, గోపీచంద్‌తో గౌతమ్ నందా, మాస్ మహరాజ రవితేజతో బెంగాల్ టైగర్, సీటీమార్, ఏమైంది ఈ వేళ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు.
దర్శకుడు సంపత్ నందికి పితృవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


