Tuesday, January 27, 2026
E-PAPER
Homeకరీంనగర్పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ సమస్యలను అసెంబ్లీలో చర్చించండి

పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ సమస్యలను అసెంబ్లీలో చర్చించండి

- Advertisement -

చేనేత పవర్ లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంతం రవి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్లలోని పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ మరియు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు చేనేత పవర్లూం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంతం రవి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పంతం రవి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో యజమానులకు రావలసిన సుమారు 250 కోట్ల రూపాయలను యజమానులకు చెల్లించారని కానీ కార్మికులకు కనీసం ఉన్న ఒక్క పథకమైన 10% సబ్సిడీని ప్రస్తుత ప్రభుత్వం తొలగించడం చాలా దుర్మార్గమని అదే క్రమంలో  కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నా వర్కర్స్ టు ఓనర్ పథకాలకు సంబంధించిన షెడ్లను గోదాములుగా మార్చడాని పట్టి చూస్తే ప్రస్తుత ప్రభుత్వము యజమానుల వైపా కార్మికులవైపా అనేది స్పష్టంగా అర్థం అవుతుంది అని పంతం రవి అన్నారు.

యార ను డిపోలో గత నెల రోజులుగా యారను లేదని ఇది టెస్కో అధికారులు పెద్ద యజమానులకు లబ్ధి చేకూర్చేందుకు చేపట్టిన చర్యనేనని, కార్మికుల ఉపాధిని అడ్డం పెట్టుకొని విద్యుత్ సంస్థకు చెల్లించాల్సిన సుమారు 33 కోట్ల రూపాయలను ఎగవేసే ప్రయత్నాలు చేస్తున్నారని విషయాలన్నీ ప్రస్తుతం జరుగుతున్న శాసన సభలో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సిపిఐ ఎమ్మెల్యే  కోణంనేని సాంబశివరావు ను కోరామని పంతం రవి అన్నారు. ఎమ్మెల్యేను సోమ నాగరాజు గాజుల లింగము రాయమల్లు మండల వెంకటేశు తదితరులు కలవడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -