Thursday, August 7, 2025
E-PAPER
Homeజాతీయంతెలంగాణ నుంచి మరింతగా బియ్యం ఎగుమతిపై చర్చ

తెలంగాణ నుంచి మరింతగా బియ్యం ఎగుమతిపై చర్చ

- Advertisement -

– ఫిలిప్పీన్స్‌ వ్యవసాయశాఖ మంత్రిని కలిసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
– త్వరలో తెలంగాణ పర్యటనకు ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్‌ జూనియర్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు మరింత బియ్యం ఎగుమతిపై చర్చ జరిగింది. బుధవారం నాడిక్కడ ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్‌ జూనియర్‌ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కలిశారు. తెలంగాణ నుంచి మరింత బియ్యం ఎగుమతిపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. స్నేహ పూర్వక, సహకార వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. తెలం గాణ నుంచి దిగుమతి చేసుకుంటున్న నాణ్యత ఉన్న బియ్యం పట్ల ఫిలిప్పీన్స్‌ మంత్రి ప్రశంసలు కురిపించారు. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతుల పరిధిని విస్తరించడానికి ఆయన ఆసక్తి కనబర్చారు. తెలంగాణ, ఫిలిప్పీన్స్‌ మధ్య వాణిజ్య సంబంధాన్ని విస్తరించడానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో పర్యటించాలని ఫిలిప్పీన్స్‌ మంత్రిని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆహ్వానించారు. దీనిపై ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్‌ జూనియర్‌ సానుకూలత వ్యక్తం చేశారు.బియ్యంతో పాటు వరి ధాన్యాన్ని ఎగుమతి చేయాలనే తెలంగాణ ప్రతిపాదనపై ఫిలిప్పీన్స్‌ మంత్రి సానుకూలంగా స్పందించారు. పౌర సరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌.. తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) బియ్యం రకాన్ని ఎగుమతి చేసుకోవచ్చని సూచించారు. దీనిపైనా ఫిలిప్పీన్స్‌ మంత్రి ఆసక్తి చూపించారు. అంతేకాకుండా తెలంగాణ నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకునే అవకాశం గురించి ఫిలిప్పీన్స్‌ మంత్రి ఆరా తీశారు. తెలంగాణలో పర్యటించాలని కోరిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని.. ఫిలిప్పీన్స్‌ మంత్రి వారి దేశంలో పర్యటించాలని ఆహ్వానించారు. వాణిజ్య సంబంధం, సహకారాన్ని మరింతగా పెంచుకోవాలనే బలమైన కోరికను ఇరు పక్షాలు వ్యక్తం చేశాయి. దీంతో ఈ సమావేశం చాలా సానుకూలంగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -