Thursday, November 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రపంచ ప్రఖ్యాత ఫిలిం సిటీ ఏర్పాటుపై సమాలోచనలు

ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం సిటీ ఏర్పాటుపై సమాలోచనలు

- Advertisement -

సినిమా రంగ ప్రముఖులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో కలిసి తెలుగు క్లబ్‌ లో ఏర్పాటు చేసిన సినీరంగ ప్రము ఖులు, కార్మిక నాయకుల సమా వేశంలో ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు సినీ పరిశ్రమకు మేలు జరిగిందని గుర్తు చేశారు. ఈ రంగంలో పని చేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు చెన్నైలో ఉన్న పరిశ్రమను హైదరాబాద్‌ రప్పించి, సినీ స్టూడియోలు నిర్మించేందుకు ప్రభుత్వమే భూములు ఇచ్చిందని వివరించారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు తదితర సినీ స్టూడియోలన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. ఫిలిం క్లబ్‌కు స్థలం సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు.

సినీ కార్మికుల కోసం సీనియర్‌ నటుడు ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ ఏర్పాటు మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిందని గుర్తు చేశారు. పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ”హైదరాబాద్‌ నగరం అన్ని భాషల వారిని అక్కున చేర్చుకుంటుంది. అంతర్జాతీయ విమానాశ్రయం. తక్కువ ధరకే మానవ వనరుల లభ్యత మొదలగు అనుకూలతలు ఇక్కడ పరిశ్రమ నిలబడటానికి దోహదం చేస్తాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచం మెచ్చే ఫిలిం సిటీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది” అని భట్టి చెప్పారు. మా అసోసియేషన్‌ కార్యాలయ నిర్మాణ స్థలం విషయంలో త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మెన్‌ దిల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -