ఉక్రెయిన్, యూరోపియన్ నాయకుల భేటీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్వాగతం పలికిన జర్మన్ బుండెస్టాగ్ అధ్యక్షురాలు జూలియా క్లోక్నర్
బెర్లిన్ : ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, యూరోపియన్ నాయకుల ఉన్నతస్థాయి చర్చలకు జర్మనీలోని బెర్లిన్ వేదికయ్యింది. అమెరికా శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్, అమెరికన్ సంధాన కర్తల మధ్య చర్చలు జరిగాయి. బెల్జియంలో నిరవధికంగా స్తంభింపజేసిన రష్యన్ ఆస్తుల అంశంతో పాటు వాటిని ఎలా ఉపయోగిం చాలనే దానిపై సమాలోచనలు ఉండవచ్చని తెలుస్తోంది. పాశ్చాత్య భద్రతా హామీలకు బదులుగా ఉక్రెయిన్ నాటోలో చేరాలనే తన ఆశయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందని జెలెన్స్కీ చెప్పారు. అయితే అనేక కీలకాంశాలపై ఎంత పురోగతి సాధించారో అస్పష్టంగా ఉంది. దీంతో రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య పోరాటం కొనసాగుతోంది. రష్యా 153 డ్రోన్‌లను పేల్చిందని, అలాగే 17 స్థావరాలపై గురి పెట్టగా.. ఛేదించాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.



