వంట దిగుబడి లేక నష్టాలు
అందని ప్రభుత్వ పథకాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
సొంత భూములు లేని రైతులు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నారు.దిగుబడి లేకపోవడం, పెట్టిన పెట్టుబడి రాక నష్టపోతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో కౌలు భూములకు ఈ ఏడాది ప్రస్తుతం డిమాండ్ తగ్గింది. దీంతో కౌలు సాగుకు వారు ఆసక్తి చూపడం లేదు. చిన్న, సన్నకారు రైతులు ఏటా ఇతరుల నుంచి ఐదు నుంచి పదెకరాల వరకు సాగు భూమిని కౌలుకు తీసుకుని పంటలు వేస్తుంటారు. ముందుగా పట్టాదారు రైతులకు డబ్బులు చెల్లించి రెండు పంటల సాగుకు ఒప్పందం చేసుకుని పండిచేవారు. దిగుబడి రాకపోవడం రైతులకు నష్టాలు వచ్చాయి. ఈఏడాది పత్తి, వరి, మిర్చి, పంటలు పండక కౌలు సాగుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పట్టణాల్లో ఉద్యోగరీత్యా, వ్యాపారం నిమిత్తం ఉంటూ ఈసారి ఇతరులకు కౌలుకు ఇచ్చే పట్టాదారులు భూములు కౌలుకు పోతాయో లేవోనని ఆందోళన చెందుతున్నారు.
కౌలు రైతులకు అందని పథకాలు
రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు కౌలు రైతులకు అందడం లేదు.దీనికితోడు ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయాలు చేపట్టలన్నా ఇబ్బంది తప్పడం లేదు. ఆన్లైన్ ద్వారా పంటల రిజిస్ట్రేషన్, యూరియా, ఇతర ఎరువుల కోసం ఆన్లైన్ ద్వారా పట్టాదారు ద్వారా బుకింగ్ తదితర ద్వారా కౌలు రైతులు అవస్థలు పడుతున్నారు. గుర్తింపు కార్డులు లేక ఎలాంటి ప్రోత్సాహం అందక సాగుకు ఆసక్తి చూపుతున్నారు.



