నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్తుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని, దీంతో కేటీఆర్, హరీశ్ రావు ఇంట్లో కూర్చొని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో మరిచిపోయారని అన్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే.. వీళ్ల బాగోతాలన్నీ బయటపడ్తయ్.
గత పదేండ్లు మామ, అల్లుడు, కొడుకు సొంత నియోజకవర్గాలనే అభివృద్ధి చేసుకున్నరు. మిగిలిన వాటిని పట్టించుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ అటెండ్ కావాలి. తప్పు చేయకపోతే.. చేయలేదని ఒప్పుకోవాలి. తప్పు చేసి ఉంటే స్వచ్ఛందంగా అంగీకరించాలి. మేడిగడ్డ బ్యారేజ్ ను కాంగ్రెసోళ్లే బాంబులతో పేల్చారని కేటీఆర్ అనడం సరికాదు. ఆ టైమ్‌లో అధికారంలో ఉన్న మీ ప్రభుత్వమే కదా.. ఎందుకు విచారణ జరపలేదు? కేసీఆర్.. ఓ ఫెయిల్యూర్ సీఎం.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలకు తెలిసిపోయింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి వర్కర్స్ చనిపోతే రాజకీయం చేశారు. అధికారం కోల్పోయేసరికి ఏం మాట్లాడుతున్నాడో కేటీఆర్‌కే తెల్వడం లేదు’’అని వెంకట్ రెడ్డి అన్నారు.
ఆస్తుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES