- Advertisement -
- ఉల్లంఘించి డీజేలతో నిమజ్జనోత్సవ శోభయాత్ర
- నవతెలంగాణ-బెజ్జంకి
- గణేశ్ నిమజ్జనోత్సవంలో డీజేలకు అనుమతుల్లేవని..శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ శాఖ అధేశాలు జారీ చేశారు. రేగులపల్లి,దాచారం గ్రామాల్లో గురువారం పలువురు మండపాల నిర్వహాకులు జిల్లా పోలీస్ శాఖ అధేశాలను ఉల్లంఘించి నిమజ్జనోత్సవంలో యథేచ్ఛగా డీజేలతో శోభయాత్ర నిర్వహించడం.. ఉన్నతాధికారి అధేశాలను స్థానిక పోలీసులు అమలు చేయడంలేదని పరువురు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారిచ్చిన అధేశాలను నిఖచ్చితంగా అమలు చేస్తేనే..మరోసారి పోలీసుల అధేశాలను ప్రజలు పాటిస్తారని పలువురు సూచిస్తున్నారు.జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఇచ్చిన అధేశాలను స్థానిక పోలీసులు అమలు చేస్తారా..లేదానేది నేడు గణేశ్ నిమజ్జనోత్సవంలో తేలనుంది.
- Advertisement -