Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లాపూర్ లో గృహజ్యోతి పథకం బిల్లుల పంపిణీ 

మల్లాపూర్ లో గృహజ్యోతి పథకం బిల్లుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
డోంగ్లీ మండల్ మల్లాపూర్ గ్రామంలో ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహ జ్యోతి పథకం ద్వారా నేలకు 200 యూనిట్లు వరకు ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్తు అందించే బిల్లులను ఆ గ్రామ సర్పంచ్ అమృత్వార్ శ్రీకాంత్ గ్రామ వినియోగదారులకు బిల్లులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి మాట్లాడుతూ.. ప్రతి వినియోగదారులు  విద్యుత్తు బిల్లులు కోసం ఖర్చు చేసే డబ్బును పిల్లల చదువు ఆరోగ్యం మరియు కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని,  ప్రజలకు ఎల్లవేళలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఉచిత విద్యుత్ బిల్లులతో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -