Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ 

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకోడప్ గాల్ 
రాజకీయాలకతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్నట్లుకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డితెలిపారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున మండలానికి చెందిన6మంది లబ్ధిదారులకు రూ.2 లక్షల 51వేయిల 500 వేల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు అనారోగ్యం బారిన పడితే ప్రభుత్వం తరఫున సహాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయ నిధి ధ్యేయమన్నారు. ఇందులోఎలాంటి రాజకీయాలకు తావు లేదని ప్రజలు నేరుగా వచ్చి తమ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్,బసవరాజ్ దేశాయ్, బాబు దేశాయ్, విట్టల్ హైమద్,లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -