నవతెలంగాణ – ధర్మసాగర్
మండలంలోని క్యాతంపల్లి,జానకిపురం గ్రామాలలోని మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు విద్యాసామాగ్రిని డాక్టర్ ఎం. ప్రశాంతి, రసాయనశాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్ రెండు పాఠశాలల విద్యార్థులకు నోటుబుక్స్ మరియు పెన్లు విరాళంగా అందించారు.ఈ సందర్భంగా డా. ప్రశాంతి మాట్లాడుతూ చిన్న సహాయాలు కూడా విద్యార్థుల చదువుపై గొప్ప ప్రభావం చూపుతాయని,విద్యకు తోడ్పాటు అందించడాన్ని మన అందరి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు.విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అందుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి. రమేశ్, ఎన్. వెంకట్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు బి. సమ్మిరెడ్డిపాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ బడిలో విద్యాసామగ్రి పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES