నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత నట్టల నివారణ మందులను గొర్రెలు మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తిరుపతి లలిత హనుమాన్లు పేర్కొన్నారు. ఈ మందుల వల్ల కడుపులోనున్న నట్టలు చనిపోయి గొర్రెల మేకలకు ఆరోగ్యాన్ని అందజేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి పశు సంవర్ధక శాఖ అధికారి గంగాధరయ్య పాల్గొన్నారు. నట్టల నివారణ మందుల ఆవశ్యకత గురించి ఆయన వినియోగదారులకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో 26 20 గొర్రెలు, 16 98 మేకలకు ఉచిత నట్టల నివారణ మందులను పంపిణీ చేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ విట్టల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పశు వైద్యాధికారులు గంగరాజు, నాగరత్నంసిబ్బందిద్య సిబ్బంది లక్ష్మణ్, సావిత్రి, గొర్రెలు మేపకం పెంపకం దారులు చింతాల హనుమన్లు, నవీన్, దేవయ్య, గొల్ల హనుమన్లు, లక్ష్మణ్, రవి, తదితరులు పాల్గొన్నారు
ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



