- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సిద్దరమేశ్వర ఆలయంలో భక్తులకు పండ్ల పంపిణి కార్యక్రమాన్ని కౌసల్య దేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దబచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సుమారు 1000 మంది భక్తులకు పండ్లు పంపిణీ చేసి, శివరాత్రి వేడుకల్లో భాగస్వాములైన భక్తులకు సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మహా శివరాత్రి వంటి పవిత్రమైన రోజున భక్తులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -



