నవతెలంగాణ – కంఠేశ్వర్ : సామాజిక సేవలో భాగంగ ఆక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోనీ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పండ్లు పంపిణీ అక్షిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సన్నీ కుమార్ రాపాక చేశారు. ఆహారంలో పోషకాహారాన్ని పెంపొందించేందుకు ఇది దోహదం చేస్తుందనే అభిప్రాయంతో పలు ఆరోగ్యవంతమైన పండ్లను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో తల్లులు ఆరోగ్యంగా ఉండాలని, సమాజం తరపున మా బాధ్యతగా ఈ చిన్న సహాయ చర్య చేపట్టామని మేము నిరంతరం ప్రజాసేవలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడతాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, నర్సులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు ఈ సేవకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు పండ్ల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES