Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కన్నాయిగూడెంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

కన్నాయిగూడెంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయిగూడెం మండలంలోని రైతు వేదికలో మండల పరిధిలోని మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
తర్వాత మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 102 సంఘాలకు రూ.6 కోట్ల 47 లక్షల 55 వేల ఋణాల పంపిణీ చెక్కను మంత్రి సీతక్క అందచేశారు. అనంతరం కన్నాయిగూడెం  మండల పరిధిలోని 16 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ/ షాది ముభారక్ చెక్కులను మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టి.ఎస్ ,డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, మండల ప్రత్యేక అధికారి వెంకట్ నారాయణ, తహసిల్దార్ సర్వర్ ,ఎంపి డి ఓ అనిత ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కళ్యాణ లక్ష్మీ/షాది ముభారక్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -