Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ 

మండలంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
మండల వ్యాప్తంగా ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు సోమవారం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏపీఎం ఎండీ మహబూబ్ పాషా, గ్రామ ప్రత్యేకాధికారి బుధారపు శ్రీనివాస్ మహిళలకు చీరలు అందజేశారు. అనంతరం ఏపీఎం మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా, ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నామని చెప్పారు. మండలంలోని 28 గ్రామ ఐక్య సంఘాల్లో మొత్తం 7216 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, వీరందరికీ ఇందిరమ్మ చీరలు వచ్చాయని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ చీరల కోసం సభ్యులు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు, సీసీ లు సుధాకర్, సుజాత, ఉమ, మహిళా కాంగ్రెస్ నాయకులు ముద్దసాని పారిజాత సురేష్, చిలుక దేవేంద్ర, బెడద, వీవోఏ లు రఘుపతి, వసంత, మణెమ్మ, మహిళలు మంజుల, సుజాత, యాకమ్మ, శోభ, సునిత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -