Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస కొత్తూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

హాస కొత్తూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్య క్రమం నిర్వహించారు.లబ్దిదారులకు గ్రామ సర్పంచ్  నలిమెల రేవతి గంగాధర్, మండల తహసిల్దార్ గుడిమెల ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు.

అర్హులైన లబ్ధిదారులందరూ ఈ పథకాలను సద్వినిగం చేసుకోవాలని కోరారు. తమ ఆడబిడ్డల వివాహానికి చేయూతను అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, చెక్కులు రావడానికి కృషి చేసిన బాల్కొండ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, మండల రెవెన్యూ అధికారి శరత్ కుమార్, గ్రామ పంచాయతీ అధికారి శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, వార్డ్ సభ్యులు పెద్ది సృజన్, కుందేటి శ్రీనివాస్, కనక నర్సయ్య, లబ్దిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -