- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలో రేషన్ కార్డులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, రామకృష్ణ పేర్కొన్నారు. రేషన్ కార్డు రాని వారు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ఇది నిరంతర ప్రక్రియ కోనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ లింబాద్రి, బాజేందర్ ,హరీష్, గంగి భూపతి, సాగర్,రామచందర్, సతీష్ రెడ్డి, దేవేందర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -