Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు వితరణ

పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు వితరణ

- Advertisement -

 నవతెలంగాణ – భీంగల్
మండ‌లంలోని జగిర్యాల గ్రామ ఉన్నత పాఠ‌శాల విద్యార్థుల‌కు 25,000 రూపాయల విలువగల క్రీడా దుస్తులను, క్రీడా వస్తువులను పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ఆధ్వ‌ర్యంలో శుక్రవారం 24 మంది విద్యార్ధిని విద్యార్ధులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా దాతలు సంగెం రాహుల్, సంగెం ప్రశాంత్, మాజీ ఉపసర్పంచ్ సంగెం శ్రీకాంత్ మాట్లాడుతూ… రానున్న రోజుల్లో విద్యార్థులకు మండల స్థాయి ఆటల పోటీలు ఉండబోతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ ఒకే యూనిఫాంలో ఒకేలా కనిపించాలని, ఈ దుస్తుల ద్వారా వారిలో ఉత్సాహం పెరుగుతుందని, క్రీడలలో రాణించాలనే ఆసక్తి పెరుగుతుందని అన్నారు. విద్యార్థిని, విద్యార్థినుల‌కు క్రీడా దుస్తులు అంద‌జేయ‌డ‌మే కాకుండా పాఠ‌శాల‌కు కావాల్సిన సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లో త‌మ స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. విద్యార్థులు చ‌దువుతో పాటు క్రీడ‌ల్లోనూ రాణించాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా దాత‌ల పట్ల గ్రామ యువకులు,పాఠ‌శాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -