విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ..

నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ విద్యాసంవత్సరం నుండి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశ భోధన హోదాను కల్పించుకున్నామని ఉత్తమ పలితాలు సాదించేల ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి గ్రామానికి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని సర్పంచ్ నర్సింగరావు విద్యార్థులకు సూచించారు. ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మి, వార్డ్ సభ్యులు, పాఠశాల బోధన సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love