Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు టై బెల్ట్ ల వితరణ..

విద్యార్థులకు టై బెల్ట్ ల వితరణ..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ 
నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని 87మంది విద్యార్థులకు   బుధవారం గ్రామ మాజీ సర్పంచ్ దేశబోయిన సాయిలు టై బెల్టులను వితరణ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దేశబోయిన సాయిలు  మాట్లాడుతూ.. విద్యార్థులందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి జ్ఞానాన్ని పొంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనసూయ , పంచాయతీ కార్యదర్శి శంకర్ నాయక్ , మాజీ సర్పంచ్ లక్ష్మా గౌడ్, మాజీ ఎంపీటీసీ రమావత్ దేవి సింగ్ , పిఎసిఎస్ వైస్ చైర్మన్ మిద్దె బాబురావు ,పాఠశాల మాజీ చైర్మన్లు జోడు సురేందర్ , మిద్దె బాలరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, రాకేష్, రియాజ్ తోపాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img