Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ 

విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండలం బాలనగర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో  సబ్బాని గౌతమ్ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ శ్రీ కోమిరే రాజు మాట్లాడుతూ.. పుట్టినరోజులు చాలామంది జరుపుకుంటారు గానీ ఇలా పేద పిల్లలకు సహాయం చేసినప్పుడు మంచి జరుగుతుంది. కాబట్టి మునుముందు ఎవరైనా పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు చేసి ముందుండాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బోదాస్ శ్రీనివాస్, వార్డు సభ్యులు బోదాస్ శ్రీను, పంచాయతీ సెక్రెటరీ నర్సరెడ్డి, బోదాస్ మల్లేష్, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సునీత, విట్టల్ రావు, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -