Thursday, May 29, 2025
Homeతెలంగాణ రౌండప్నవతెలంగాణ కథనానికి కదలిన జిల్లా యంత్రాంగం

నవతెలంగాణ కథనానికి కదలిన జిల్లా యంత్రాంగం

- Advertisement -

వినాయక ఫ్యూయల్ స్టేషన్ ను తనిఖీ చేసిన అధికారులు
పెట్రోల్ – మిథనాల్  రసాయన సమ్మేళనం కలవలేదు : అధికారులు
నవతెలంగాణ – రాయపర్తి: అను దినం ప్రజల పక్షాన నిలిచే నవతెలంగాణ దినపత్రిక కల్తీ పెట్రోల్ పై కథనాలు ప్రచురించడంతో జిల్లా యంత్రాంగం కదిలింది. వివరాల్లోకి వెళితే.. రాయపర్తి మండల కేంద్రం శివారులోని వినాయక ఫ్యూయల్ స్టేషన్ (హెచ్ పి బంకు)లో పెట్రోల్ తెల్లగా ఉండడంతో  “పెట్రోల్ బంకులో.. పెట్రోల్ కల్తీపై అపోహలు..!”, “కల్తీ పెట్రోల్ వ్యవహారం కక్కలేక మింగలేక” అనే కథనాలు నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితం కావడంతో సంబంధిత జిల్లా అధికారులు స్పందించారు. గురువారం డిస్టిక్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ అజీజ్ పాషా, డీటీ సివిల్ సప్లై ఆఫీసర్ మధుసూదన్, హెచ్ పి సిఎల్ సేల్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ చంద్రమోహన్ వినాయక ఫ్యూయల్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పెట్రోల్ శాంపిల్స్ తీసి పరీక్షించారు. పెట్రోల్ లో మిథనాల్ రసాయన సమ్మేళనం పూర్తిగా కలవకపోవడంతో పెట్రోల్ తెల్లగా వచ్చిందని తెలిపారు. దాంతో స్థానిక వాహనదారులు పెట్రోల్ బంక్ నిర్వాహకుల తీరు ఏం మాత్రం బాగోలేదని, ఈ పెట్రోల్ తో వాహనాల మైలేజ్ చాలా తగ్గుతుందని ఆరోపించారు. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగవాని మొదటిసారిగా క్షమించాలని నిర్వాహకులు కోరారు. వినియోగదారులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పెట్రోల్ శాంపిల్స్ చూపమని అధికారులు తెలుపగా నాలుగు శాంపిల్స్ బాటిల్లకు రెండు సీల్ చేసిన శాంపిల్స్ చూపడంతో వాహనదారుల్లో మరింత అనుమానం రేకెత్తుతుంది. ఏదేమైనా వినాయక ఫ్యూయల్ స్టేషన్ పై స్థానిక వాహనదారులకు నమ్మకం పోయిందని స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోలు కల్తీ వ్యవహారం బట్టబయలు చేసిన నవతెలంగాణ దినపత్రికకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -