Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు శుభాకాంక్షలు తెలిపారు. 2026 వ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందంతో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని  అభిలషించారు. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని మరింత పట్టుదల, కృషితో తో విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి గెలుపునుందించే సంవత్సరం కావాలని కలెక్టర్ అభిలషించారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలు, పుష్ప గుచ్చాలు, శాలువాలు తేవొద్దని జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -