- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ మండల కేంద్రంలో ఉన్న 108,102 అంబులెన్స్ వాహనాలను జిల్లా 108 మేనేజర్ ఆశోద్ ఐలయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో ఉన్న వెంటిలేటర్, మల్టీ ఛానల్ మానిటర్‌తో పాటు ఇతర అత్యవసర వైద్య పరికరాల పనితీరును ఒక్కొకటిగా పరిశీలించారు. అలాగే ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే మందులు, రికార్డుల గురించి ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు త్వరితగతిన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం 102 అంబులెన్స్‌ను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 108,102 సిబ్బంది నూకపల్లి మల్లారెడ్డి, సంధ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



