18 వ వార్డులో ట్రాన్స్ ఫార్మర్ తో ఎర్తింగ్ సమస్య
నవతెలంగాణ-ఆసిఫాబాద్
అసలే విద్యుత్ తో ఆటలాడడం ఎంతో ప్రమాదకరం. అటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇంటి గోడను అనుకొని ఉండడం దాంతో పదేపదే ఎర్తింగ్ సమస్య రావడం అధికారులకు బాధితులు చెప్పిన పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో ఓ ఇంటికి ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కారణంగా ఇంట్లో ఎర్తింగ్ సమస్య ఏర్పడుతోందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను గత కొన్ని నెలలుగా సంబంధిత విద్యుత్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. సమస్య కారణంగా కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్, విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి, ప్రజల భద్రతకు ప్రమాదం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)