- డీఎఫ్ఓకు సత్తుపల్లి ముస్లిం నాయకుల వినతి
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ఎదురుగా ఏళ్ల తరబడి ముస్లింల ఆధ్వర్యంలో ఉన్న కబరస్థాన్ స్థలానికి అటవీ శాఖ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్ఓ) అనూస్ అగర్వాల్‌ను సత్తుపల్లి ముస్లిం నాయకులు కోరారు. ఆ స్థలం యథాతథంగా అక్కడే ఉండేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక అటవీశాఖ కార్యాలయానికి వచ్చిన డీఎఫ్ఓ అనూస్ అగర్వాల్ ను ముస్లిం నాయకులు మొహమ్మద్ కమల్ పాషా ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఎస్.కె. మౌలాలి, బండారు శరత్ చంద్ర, జగన్నాథం శీనులతో పాటు ఎన్టీఆర్ నగర్ మసీదు కమిటీ సభ్యులు ముజ్జు జిన్నీ, ఎల్‌ఐసీ జానీ కలిసి వినతిపత్రం సమర్పించారు. కబరస్థాన్ స్థలం విషయంలో ఉన్న సమస్యలను డీఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన డీఎఫ్ఓ అనూస్ అగర్వాల్, సమస్యను పరిశీలించి తగిన పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.







కామెంట్‌లు (0)