నవతెలంగాణ-ఆసిఫాబాద్
వన్యప్రాణుల సంరక్షణ పై విద్యార్థి దశ నుండి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ రేంజ్ అధికారి యోగేష్ కులకర్ణి అన్నారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లోని పిటిజి బాలుర పాఠశాలలో ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతౌల్యం లాంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులకు కూడా విద్యార్థులు ప్రాధాన్యత తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ శిక్షణ అధికారి మహేందర్, బీట్ అధికారి ప్రకాష్, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, వార్డెన్ కృష్ణ చారి పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)