– పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-నాచారం
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాప్రా మున్సిపల్ కార్యాలయం పరిధిలోని నాచారం సర్కిల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నాచారం డివిజన్‌కు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, క్షేత్రస్థాయి సమన్వయం, ఓటర్లతో సంప్రదింపులు, ప్రచార కార్యక్రమాల రూపకల్పన తదితర అంశాలపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియపై గ్రాడ్యుయేట్ ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుని సంబంధిత అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరును కలుసుకుని ఎన్నికల ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. సమావేశంలో పలువురు నాయకులు ఎన్నికల సన్నాహకాలపై తమ అభిప్రాయాలు, సూచనలను వెల్లడించారు.







కామెంట్‌లు (0)