Magazines

3-6 ఏళ్లలోపు పిల్లలను 'అంగన్వాడీ' కేంద్రాలకు పంపించాలి

46 నిమిషాల క్రితం

Anganwadi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

- పోషకాహారంతోనే గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యం

- ​సీడీపీఓ సత్యవతి, సూపర్ వైజర్ మహాలక్ష్మి

​నవతెలంగాణ - సత్తుపల్లి

​3 నుంచి 6 ఏళ్ల పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సత్తుపల్లి ఐసీడీఎస్ సీడీపీఓ సత్యవతి, సూపర్ వైజర్ యు. మహాలక్ష్మి తల్లులకు సూచించారు. 9వ జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా అయ్యగారిపేట-2 అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీడీపీఓ సత్యవతి, సూపర్ వైజర్ మహాలక్ష్మి మాట్లాడారు. చిన్నారులకు ప్రాథమిక విద్య, సరైన పోషకాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు.


అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహార ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వారు వివరించారు. పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహార పదార్థాల ప్రదర్శన, గర్భిణులకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యగారిపేట పాఠశాల హెచ్‌ఎం రవీంద్రారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లులు, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్