Magazines

కుల వివక్ష నిర్మూలనకు ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి

49 నిమిషాల క్రితం

discrimination
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

- కేవీపీఎస్ మండల కార్యదర్శి దాట్ల రాంబాబు

- కాకర్లపల్లిలో కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుక

నవతెలంగాణ-సత్తుపల్లి 

​కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ దళితుల హక్కుల పరిరక్షణ కోసం కేవీపీఎస్ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘ  సత్తుపల్లి మండల కార్యదర్శి దాట్ల రాంబాబు తెలిపారు. కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం కాకర్లపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు  మాట్లాడుతూ... రాజ్యాంగం సమాన హక్కులు కల్పించినా నేటికీ దళితులపై కుల వివక్ష కొనసాగడం విచారకరమన్నారు.


దళితులపై జరుగుతున్న దాడులు, అంటరానితనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన దళితులకు ఇళ్ల స్థలాలు, భూమి, విద్య, ఉపాధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించాలన్నారు. సామాజిక న్యాయం కోసం ప్రజలందరూ ఐక్యంగా నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. ​గ్రామ గ్రామాన ప్రజల్లో చైతన్యం తెచ్చి కుల వివక్ష నిర్మూలన ఉద్యమాలను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావూరి వెంకటేశ్వరరావు, తడికమళ్ల రామకృష్ణ, వేపులపాటి కుమారస్వామి, బండి వేలాద్రి, కొంగల సతీష్, బెజవాడ లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు  పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్