Magazines

హోరాహోరీగా అండర్‌ - 20 బాలికల కబడ్డీ పోటీలు

1 గంట క్రితం

kabaddi competitions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 2 నిమిషాల చదవడం

- 33 జిల్లాల జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు

- రెండో రోజు కొనసాగిన రాష్ట్రస్థాయి క్రీడా సంరంభం

- పలు మ్యాచ్‌ల్లో భారీ పాయింట్లతో జట్ల విజయం

నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌–20 బాలికల కబడ్డీ పోటీలు అశ్వారావుపేటలో రెండో రోజు ఆదివారం ఉత్సాహంగా కొనసాగాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల జట్లకు చెందిన క్రీడాకారిణులు హోరాహోరీగా తలపడుతూ తమ క్రీడా ప్రతిభను చాటుతున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా క్రీడాకారిణులు పోరాడుతుండటంతో పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.

మొదటి రోజు ఫలితాలు:

శనివారం జరిగిన పోటీల్లో మొదటి రౌండ్‌లో రంగారెడ్డి 52 పాయింట్లతో భూపాలపల్లిపై, నల్గొండ 61 పాయింట్లతో ఆసిఫాబాద్‌పై, ఖమ్మం 61 పాయింట్లతో సూర్యాపేటపై, కొత్తగూడెం 46 పాయింట్లతో సంగారెడ్డిపై విజయం సాధించాయి.

రెండో రౌండ్‌లో మేడ్చల్‌ 51 పాయింట్లతో మహబూబాబాద్‌పై, మహబూబ్‌నగర్‌ 47 పాయింట్లతో కామారెడ్డిపై, కరీంనగర్‌ 41 పాయింట్లతో సిద్దిపేటపై, జనగాం 38 పాయింట్లతో జగిత్యాలపై గెలుపొందాయి.

మూడో రౌండ్‌లో వనపర్తి 31 పాయింట్లతో హైదరాబాద్‌–1పై, నిజామాబాద్‌ 39 పాయింట్లతో మెదక్‌పై, వరంగల్‌ 43 పాయింట్లతో మంచిర్యాలపై, మేడ్చల్‌ 38 పాయింట్లతో నారాయణపేటపై విజయం సాధించాయి.

నాలుగో రౌండ్‌లో నిర్మల్‌ 47 పాయింట్లతో గద్వాల్‌పై, కరీంనగర్‌ 42 పాయింట్లతో ఆదిలాబాద్‌పై, ములుగు 38 పాయింట్లతో సిరిసిల్లపై, భోనగిరి 37 పాయింట్లతో హనుమకొండపై గెలిచాయి.

రెండో రోజు ఫలితాలు:

ఆదివారం జరిగిన మొదటి రౌండ్‌లో నిర్మల్‌ 47 పాయింట్లతో గద్వాల్‌పై, కరీంనగర్‌ 42 పాయింట్లతో ఆదిలాబాద్‌పై, ములుగు 38 పాయింట్లతో సిరిసిల్లపై, భోనగిరి 37 పాయింట్లతో హనుమకొండపై విజయం సాధించాయి.

రెండో రౌండ్‌లో జనగాం 36 పాయింట్లతో పెద్దపల్లిపై, మహబూబ్‌నగర్‌ 31 పాయింట్లతో సిద్దిపేటపై, నిజామాబాద్‌ 31 పాయింట్లతో జగిత్యాలపై, నారాయణపేట 45 పాయింట్లతో ఆసిఫాబాద్‌పై గెలుపొందాయి.

మూడో రౌండ్‌లో సూర్యాపేట 55 పాయింట్లతో మంచిర్యాలపై, సంగారెడ్డి 44 పాయింట్లతో హనుమకొండపై, రంగారెడ్డి 46 పాయింట్లతో గద్వాల్‌పై, నల్గొండ 54 పాయింట్లతో మేడ్చల్‌పై విజయం సాధించాయి.


నాలుగో రౌండ్‌లో నిర్మల్‌ 61 పాయింట్లతో భూపాలపల్లిపై, హైదరాబాద్‌–2 31 పాయింట్లతో సిరిసిల్లపై, ఆదిలాబాద్‌ 56 పాయింట్లతో సిద్దిపేటపై, పెద్దపల్లి 32 పాయింట్లతో జగిత్యాలపై గెలుపొందాయి.

ఐదో రౌండ్‌లో కరీంనగర్‌ 58 పాయింట్లతో కామారెడ్డిపై, జనగాం 39 పాయింట్లతో మెదక్‌పై, ఖమ్మం 56 పాయింట్లతో వరంగల్‌పై, కొత్తగూడెం 53 పాయింట్లతో వికారాబాద్‌పై విజయం సాధించాయి. నాగర్‌కర్నూల్‌ 36 పాయింట్లతో వనపర్తిపై, మహబూబ్‌నగర్‌ 33 పాయింట్లతో ములుగుపై గెలుపొందాయి.

వికారాబాద్‌ జట్టు కొత్తగూడెం చేతిలో ఐదు పాయింట్ల తేడాతో వెనుకబడింది. వార్త రాసే సమయానికి మరికొన్ని జట్ల మధ్య పోటీలు కొనసాగుతున్నాయి. క్రీడాకారిణులు ఉత్సాహంగా పాల్గొంటుండటంతో అశ్వారావుపేటలో కబడ్డీ సందడి నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్