Magazines

కారు-ఆటో ఢీ.. పలువురికి గాయాలు  

1 గంట క్రితం

Accident
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

కారు ఆటో ఢీకొని పలువురికి గాయాలైన ఘటన ఆదివారం ఆలేర్ పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజపేట మండలం రంగనాథ్ పురం గ్రామానికి చెందిన మణిదీప్ కారు నెంబర్ టిఎస్ 07 ఈఎం 7686 ఆలేరు పట్టణంలో కేక్ కొనుగోలు చేసి గ్రామానికి వెళ్తుండగా, ఎదురుగా నీళ్ల క్యాన్లతో వెళ్తున్న ఆటో టీఎస్ 30 టిఏ 5453 వాహనం అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.


ఈ ప్రమాదంతో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలతో పాటు, ఆటోలోని నీళ్ళ క్యాన్లు ఎగిరి కారు అద్దాలపై పడ్డాయి. దీంతో కారులో ఉన్న వారికి గ్లాస్ పగిలి గీసుకు పోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో తీవ్రంగా ధ్వంసమైన కారు, ఆటోలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయాన్ని పోలీసులు క్లియర్‌ చేశారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్