నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని వట్టిపల్లి,యరగండ్లపల్లి గ్రామాలలో "కపాస్ కాంతి మిషన్ పర్ కాటన్ ప్రోడక్టివిటీ"కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల వ్యవసాయ అధికారులు రైతులకు పత్తి సాగుపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పత్తిలో సరైన విత్తన దూరాన్ని పాటించడం ద్వారా మొక్కల సంఖ్యను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పంట పెరుగుదల,కలుపు నియంత్రణ,ఎరువుల వినియోగం,పురుగు తెగుళ్ల యాజమాన్యం వంటి అంశాలపై శాస్త్రీయంగా దృష్టి సారించవచ్చని వివరించారు.క్లోజర్ స్పేసింగ్ మరియు అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగు విధానాలలో పంట సాగు చేస్తున్న రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.
అనంతరం అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తున్న రైతుల పొలాలను సందర్శించారు.పొలాల్లో పత్తి మొక్కల ఎదుగుదల,విత్తన దూరం,పంట నిర్వహణ విధానం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సాగు లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని,పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సమయానుకూలంగా చేపట్టాల్సిన సాగు చర్యలను అధికారులు వివరించారు.రైతులు కేవలం సాంప్రదాయ పద్ధతులే కాకుండా శాస్త్రీయ సాగు విధానాలను అవలంబించి తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వట్టిపల్లి సర్పంచ్ సిరసనవాడ బిక్షమయ్య,మండల వ్యవసాయ అధికారి మర్రు సాహస్,ఉప సర్పంచ్ దగ్గుల లింగస్వామి,వ్యవసాయ విస్తరణ అధికారులు పి.విజయ్ కుమార్,శ్రీలత,పతంజలి ఫీల్డ్ ఆఫీసర్ భాను చందర్,తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)