నవతెలంగాణ - తొగుట
రమేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది రాజు అన్నారు. మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు అయ్యవారి రమేష్ (35) ఆకస్మికంగా మృతి చెందాడు. సోమవారం రమేష్ మృతదేహానికి పంది రాజు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమేష్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న బాధిత కుటుంబానికి రూ.3 వేలు ఆర్థిక సహాయం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న రమేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తొయేటి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తొయేటి ఎల్లం, సీనియర్ నాయ కులు పత్కుల వెంకటేశం, బండారు రమేష్ గౌడ్, అయ్యవారి వినయ్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)