కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ-మల్హర్ రావు
ఎస్ఐఆర్ (సర్) కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని ఎడ్లపల్లి సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశాన్ని సోమవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిష నర్ జ్ఞానేశు మార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై కలెక్టరేట్ ఎదుట ఈనెల 6న నిర్వహించే ధర్నాను, 8న చేపట్టే చలో రాజ్ భవన్ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత కీలకమైందని, ప్రతి ఓటు స్వేచ్ఛగా, పారదర్శకంగా వినియోగించుకునేలా ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటును పరిరక్షించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,రుద్రారం సర్పంచ్ చంద్రగిరి సంపత్,కాంగ్రెస్ నాయకులు బొమ్మ రమేష్ రెడ్డి తోపాటు పలువురు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)