Magazines

గోలనుకోండ ప్లాట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి

1 గంట క్రితం

Electricity facility
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు రూరల్ 

ఆలేరు మండలం గోలనుకోండ గ్రామంలోని ప్లాట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్లాట్ల లబ్ధిదారులు మండల స్థాయి ప్రజావాణిలో అధికారులను కోరారు. 10 ఎకరాల 30 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్లాట్లలో మొత్తం 196 మంది లబ్ధిదారులు ఉన్నారని ప్లాట్ల సాధన కమిటీ కన్వీనర్ తీగల వెంకటేశ్ తెలిపారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారులు ప్లాట్లలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారని, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నిర్మాణ పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాలనీకి ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా కల్పిస్తే మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 196 మంది లబ్ధిదారుల కుటుంబాలకు ఉపయోగపడేలా కాలనీకి తక్షణమే విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రజావాణి అధికారులను కోరినట్లు తీగల వెంకటేశ్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్