Magazines

గుడిసెలు లేని గ్రామాలు నిర్మించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం 

1 గంట క్రితం

public government
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొహమ్మద్ గౌస్

నవతెలంగాణ-మిడ్జిల్ 

ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి గుడిసెలు లేని గ్రామాలుగా ఏర్పాటు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అహ్మద్ గౌస్, మండల ఉపాధ్యక్షులు వెంకట శివప్రసాద్ అన్నారు. అన్నారు. సోమవారం మండలంలోని కంచనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మాజీ సర్పంచ్ నర్సింహులు, మండల నాయకులు సాయిలుతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాజకీయాలకతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు  తెలిపారు.


గత ప్రభుత్వంలో పేద ప్రజలు ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిపల్లి నరేందర్ రెడ్డి, సత్యం గౌడ్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, ఉప సర్పంచ్ లక్ష్మమ్మ ఐలు, ఐలయ్య, మల్లెపోగు చెన్నయ్య, పార్టీ గ్రామ అధ్యక్షులు లింగం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్