Magazines

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం

1 గంట క్రితం

Breakfast
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతి, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని సోమవారం మండల ఎంపిడిఓ క్రాంతి కుమార్, ఎంఈఓ లక్ష్మన్ బాబు, తాడిచెర్ల, ఎడ్లపల్లి, మల్లారం, పెద్దతూండ్ల గ్రామాల్లోని సర్పంచ్లు బండి స్వామి, జంగిడి శ్రీనివాస్, మేకల రాజయ్య, బండారి నర్సింగం ఆయా గ్రామాల్లోని హైస్కూల్స్, ప్రాథమిక స్కూల్, మోడల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు, విద్యా ప్రగతిని మెరుగుపరచడం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్