Magazines

ఈ ఏడాది వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్

1 గంట క్రితం

Nobel Prizes
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ బహుమతుల ప్రకటనల పర్వం అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా 2026 సంవత్సరానికి గాను వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ఇవాళ మధ్యాహ్నం ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను సంయుక్తంగా వరించింది. ఆ జాబితాలో కార్ల్ డైసర్‌రోత్ , పీటర్ హెగెమాన్ , జార్జ్ నాజెల్ ఉన్నారు.


‘లైట్-గేటెడ్ అయాన్ ఛానెల్స్, ఆప్టోజెనెటిక్స్ రంగంలో వారు చేసిన అపూర్వమైన, సంచనాత్మక ఆవిష్కరణలకు గాను ఆ ముగ్గురికి వైద్య నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నట్లుగా నోబెల్ కమిటీ వెల్లడించింది. ఈ శాస్త్రవేత్తలు కనుగొన్న ఆప్టోజెనెటిక్స్ టెక్నాలజీ ద్వారా.. కాంతిని ఉపయోగించి మెదడులోని నిర్దిష్ట కణాల (న్యూరాన్ల) పనితీరును నియంత్రించడం సాధ్యమైంది. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి నాడీ సంబంధిత రుగ్మతలు, డిప్రెషన్, ఇతర మెదడు వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధన వైద్య రంగంలో ఓ సరికొత్త విప్లవానికి నాంది పలికిందని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తం ఆరు రంగాలకు సంబంధించిన ఈ ఏడాది నోబెల్ అవార్డుల ప్రకటనలు అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 12 వరకు వరుసగా కొనసాగనున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్