నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని పెద్ద తడగూర్ గ్రామపంచాయతీ పరిధిలో నీటి సమస్య పరిష్కారం కోసం ఆ గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న సోమవారం బోరు వేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో నీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా బోరు వేయించినట్లు తెలిపారు. గ్రామంలో ప్రజల అవసరాలను బట్టి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. బోరు మోటర్ పూజా కార్యక్రమంలో సర్పంచ్ శాంతవ్వ ఈరన్న ఉపసర్పంచ్ హనుమగౌడ్ వార్డ్ సభ్యులు సుభాష్ గ్రామ కార్యదర్శి పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)